నవ్వుల హరివిల్లు… శ్రీలక్ష్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 20న శ్రీలక్ష్మి పుట్టినరోజు)
శ్రీలక్ష్మి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలు ఇట్టే విచ్చుకుంటాయి. ఆమె నవ్వుల పువ్వులు ఏరుకోవడంలోనే తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుడుతూఉంటాయి. ‘పుణ్యభూమి కళ్ళుతెరు’ చిత్రంలో నాయికగా పరిచయమైన శ్రీలక్ష్మి, తరువాత హాస్యనటిగానే పకపకలు పండించారు. జంధ్యాల చిత్రాల ద్వారా శ్రీలక్ష్మికి విశేషమైన గుర్తింపు లభించింది. ‘ఆనందభైరవి’లో ఆనందం వస్తే ఈల వేసే పాత్రలో శ్రీలక్ష్మి పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు? ఇక “శ్రీవారికి ప్రేమలేఖ, రెండు రెళ్ళు ఆరు, చంటబ్బాయ్, స్వర్ణకమలం, జయమ్ము నిశ్చయంబురా, ఆదిత్య 369, కొబ్బరి బొండాం, జంబలకిడిపంబ, రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, శుభసంకల్పం” వంటి చిత్రాలలో శ్రీలక్ష్మి అభినయం అందరికీ కితకితలు పెడుతూ ఆకట్టుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై తన వయసుకు తగ్గ పాత్రల్లో అలరిస్తున్నారు శ్రీలక్ష్మి.
Also Read
- Bajirao Peshwa : గెరిల్లా వార్‌లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
- Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్ కరువయ్యాయా?
యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రాజ్యమేలుతున్న రోజుల్లో వారి చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన నటుడు అమర్ నాథ్. ఆయన కూతురే శ్రీలక్ష్మి. ఆమె సోదరుడు రాజేశ్. ఈయన కూడా జంధ్యాల చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. రాజేశ్ కూతురు ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తోంది. ‘కౌసల్యా కృష్ణమూర్తి’లో ప్రధాన భూమిక పోషించారు ఐశ్వర్యా రాజేశ్. ఇలా శ్రీలక్ష్మి కుటుంబం నటనారంగంలోనే సాగుతోంది. శ్రీలక్ష్మి, బ్రహ్మానందం కామెడీ ఒకప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక జంధ్యాల చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో హాస్యం పండించారు శ్రీలక్ష్మి. అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు శ్రీలక్ష్మి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..