NTV Telugu Site icon

Project K: అసలు ఎలాంటి సినిమా చేస్తున్నావ్ బ్రదరూ…

Project K

Project K

బాహుబలి ప్రభాస్, మహానటి నాగ్ అశ్విన్ కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ అసలు ఏ జానర్ లో తెరకెక్కుతుంది? ఎలాంటి కథతో తెరకెక్కుతుంది? ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు? అనే ప్రశ్నలకి ఎవరికీ సమాధానం తెలియదు. కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ‘ప్రాజెక్ట్ K’ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పటివరకూ ప్రాజెక్ట్ K నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే… అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సంధర్భంగా ‘Legends are Immortal’ అనే కొటేషన్ తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ పుట్టిన రోజుకి ‘Heroes are not born, They Rise’ అనే కొటేషన్ తో ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.

తాజాగా దీపిక పదుకోణే పుట్టిన రోజున, ‘A Hope in the Dark’ అంటూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. షార్ట్ హెయిర్ తో, సిల్లౌట్ పోస్టర్ లో ఉన్న దీపికని చూస్తే ఎదో హాలీవుడ్ హీరోయిన్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి స్లోగన్స్ వాడుతున్న ప్రాజెక్ట్ K మేకర్స్, సినిమాపై అంచనాలని రోజు రోజుకీ పెంచుతున్నారు. ఇటివలే ఒక టైర్ ని ప్రాజెక్ట్ K కోసం కొత్త క్రియేట్ చేశారు అంటూ అంటే ఈ మూవీ ఏ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పటివరకూ పాన్ ఇండియా స్టార్ గానే ఉన్న ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’తో పాన్ వరల్డ్ స్టార్ అవుతాడేమో చూడాలి.

Read Also: NTR: ఒక ఇండియన్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ టాప్ 10లో ఉండడం ఇదే మొదటిసారి…

Read Also: RRR: 98 సెకండ్స్ లో 932 టికెట్స్ సోల్డ్ అవుట్… ‘ఆర్ ఆర్ ఆర్’ ది ఆల్మైటీ

Read Also: Samantha: ‘శాకుంతలం’ కోసం బుడాపెస్ట్ వెళ్ళిన చిత్ర బృందం!

Read Also: Rajamouli: కంగ్రాట్స్ కెప్టెన్… మేమంతా గర్విస్తున్నాం…