Rajamouli: కంగ్రాట్స్ కెప్టెన్… మేమంతా గర్విస్తున్నాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు, ష్యూర్ షాట్ సక్సస్ ని ఇంటి పేరుగా పెట్టుకున్న వాడు, ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచ స్థాయికి తీసుకోని వెళ్లాలనే కంకణం కట్టుకున్న వాడు ‘ఎస్.ఎస్. రాజమౌళి’. సినిమా సినిమాకి మార్కెట్ ని పెంచుతూ, సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ ని పెంచుతూ తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన రాజమౌళి. ఇప్పుడు ఇండియన్ సినిమాని గ్లోబల్ వేదికపై నిలబెట్టాడు. ప్రతి భారతీయుడు గర్వించేలా ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ని గెలుచుకున్న రాజమౌళి, ఈరోజు అవార్డుని హాలీవుడ్ ప్రముఖల సమక్షంలో అందుకున్నాడు. ట్రెడిషనల్ ఇండియన్ వేర్ లో అవార్డ్స్ కి ఈవెంట్ కి వెళ్లిన రాజమౌళి, అవార్డుని అందుకున్న తర్వాత చిన్న స్పీచ్ కూడా ఇచ్చాడు.
“ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఇండియన్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో, వెస్ట్ ఆడియన్స్ కూడా అలానే రియాక్ట్ అయ్యారు. అలాంటి రియాక్షన్ ని వెస్ట్ ఆడియన్స్ నుంచి ఊహించలేదు. ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్, జంతువులతో దిగే సీన్ నన్ను చాలా ఎగ్జైట్మెంట్ కి గురి చేసింది. అదే ఎగ్జైట్మెంట్ నా ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి అనుకున్నాను, ప్రతి ఒక్కరూ ఆ సీన్ కి కనెక్ట్ అయ్యారు” అంటూ రాజమౌళి ఇంటర్నేషనల్ స్టేజ్ పై మాట్లాడారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
శోబు యార్లగడ్డ, రమా రాజమౌళి, కార్తికేయ ఇతర కుటుంబ సభ్యులతో రాజమౌళి ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. రేస్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ రావడం చాలా గొప్ప విషయం. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో కూడా రెండు నామినేషన్స్ సాదించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్కడ కూడా అవార్డులని గెలిస్తే… మన ఇండియన్ సినిమా ఆస్కార్ కి అడుగు దూరంలో నిలిచినట్లు అవుతుంది. మరి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో మన సినిమా అవార్డులని గెలుచుకుందో లేదో తెలియాలి అంటే జనవరి 11 వరకూ ఆగాల్సిందే. ఈ ఈవెంట్ కి ఆర్ ఆర్ ఆర్ టీం అంతా కలిసి హాజరవ్వనున్నారు.
Congratulations @ssrajamouli 💥💥❤️ @nyfcc 🙌🏻
You made us proud. Salute Captain 🫡 pic.twitter.com/3Ip7wL6tFk
— RRR Movie (@RRRMovie) January 5, 2023
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!