Site icon NTV Telugu

అక్క విడాకులు.. చెల్లెలు ప్రొఫైల్ పిక్ వైరల్

rajinikanth

rajinikanth

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకుల ఛాలెంజ్ నడుస్తుందా..? అంటే.. అలాగే ఉంది అంటున్నారు ప్రేక్షకులు. గతేడాది చివర్లో సమంత- నాగ చైతన్య విడాకులు ప్రకటించి షాక్ కి గురి చేశారు. ఆ తరువాత అమీర్ ఖాన్- కిరణ్ రావు జంట కూడా విడిపోయారు. ఇక ఈ ఏడాదైన ఎలాంటి చేదు వార్తలు వినకూడదు అనుకొనేలోపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాంబ్ పేల్చాడు. 18 సంవత్సరాల తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 2004 లో ఐశ్వర్య రజినీకాంత్ ని ప్రేమించిన ధనుష్ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట మధ్య విబేధాలు నెలకొనడంతో తాజాగా వారు విడిపోతున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ ఊహించని ట్వీట్ తో అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. అయితే వారి మధ్య విబేధాలు ఎప్పటినుంచో నడుస్తున్నాయని. అలా విభేదాలతో ఉండేకన్నా.. విడిపోవడమే బెటర్ అని మరికొందరు అబిప్రాయపడుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలో అక్కకు సపోర్ట్ గా నిలిచింది చెల్లి సౌందర్య. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు కూతుళ్లు.. అక్కాచెల్లెళ్లు ఎప్పుడు ఒకటిగా ఉంటారు. ఇక అక్క విడాకుల విషయమై చెల్లి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజగా తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ని మారుస్తూ అక్కను ఓదార్చింది. తండ్రి రజినీకాంత్ తో చిన్నప్పుడు అక్కాచెల్లెళ్లు కలిసి దిగిన ఫోటోను డీపీ‌గా పెట్టుకుంది సౌందర్య. దీంతో నెటిజెన్స్.. అక్కకు సపోర్ట్ గా ఉండమని చెల్లిని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version