అక్క విడాకులు.. చెల్లెలు ప్రొఫైల్ పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకుల ఛాలెంజ్ నడుస్తుందా..? అంటే.. అలాగే ఉంది అంటున్నారు ప్రేక్షకులు. గతేడాది చివర్లో సమంత- నాగ చైతన్య విడాకులు ప్రకటించి షాక్ కి గురి చేశారు. ఆ తరువాత అమీర్ ఖాన్- కిరణ్ రావు జంట కూడా విడిపోయారు. ఇక ఈ ఏడాదైన ఎలాంటి చేదు వార్తలు వినకూడదు అనుకొనేలోపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాంబ్ పేల్చాడు. 18 సంవత్సరాల తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 2004 లో ఐశ్వర్య రజినీకాంత్ ని ప్రేమించిన ధనుష్ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట మధ్య విబేధాలు నెలకొనడంతో తాజాగా వారు విడిపోతున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ ఊహించని ట్వీట్ తో అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. అయితే వారి మధ్య విబేధాలు ఎప్పటినుంచో నడుస్తున్నాయని. అలా విభేదాలతో ఉండేకన్నా.. విడిపోవడమే బెటర్ అని మరికొందరు అబిప్రాయపడుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలో అక్కకు సపోర్ట్ గా నిలిచింది చెల్లి సౌందర్య. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు కూతుళ్లు.. అక్కాచెల్లెళ్లు ఎప్పుడు ఒకటిగా ఉంటారు. ఇక అక్క విడాకుల విషయమై చెల్లి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజగా తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ని మారుస్తూ అక్కను ఓదార్చింది. తండ్రి రజినీకాంత్ తో చిన్నప్పుడు అక్కాచెల్లెళ్లు కలిసి దిగిన ఫోటోను డీపీగా పెట్టుకుంది సౌందర్య. దీంతో నెటిజెన్స్.. అక్కకు సపోర్ట్ గా ఉండమని చెల్లిని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
#NewProfilePic pic.twitter.com/0SnIQYvkkg
— soundarya rajnikanth (@soundaryaarajni) January 17, 2022
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!