Tollywood: ఇక్కడి హీరోలు అక్కడి దర్శకులు! అక్కడి హీరోలు ఇక్కడి దర్శకులు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా ఫీవర్ కారణంగా టాలీవుడ్ లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న, మధ్య తరగతి హీరోలు సైతం తెలుగులో తీసిన సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలైతే చాలానే వరుస కట్టాయి. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’, ‘యశోద’ రెండూ పాన్ ఇండియా మూవీసే. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సినిమాలనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి.
Read Also : Tollywood: ఇక్కడి హీరోలు అక్కడి దర్శకులు! అక్కడి హీరోలు ఇక్కడి దర్శకులు!!
Also Read
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
- Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ఇదిలా ఉంటే… గత యేడాదిగా టాలీవుడ్ లో ద్విభాషా చిత్రాల హడావుడి మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు తీయడం మళ్ళీ మనవాళ్ళు షురూ చేశారు. విశేషం ఏమంటే…. ఇలాంటి ద్విభాషా చిత్రాలను నిర్మిస్తున్న తెలుగు నిర్మాతలు తమిళ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు. అంటే హీరో మనవాడు. దర్శకుడు తమిళియన్ అన్నమాట. రామ్ హీరోగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘ది వారియర్’కు లింగుస్వామి దర్శకుడు. అలానే ఆయనే నాగచైతన్యతో తీయబోతున్న బై-లింగ్వల్ మూవీకి తమిళియన్ వెంకట ప్రభు డైరెక్టర్. చిరంజీవితో సూపర్ గుడ్ సంస్థ నిర్మిస్తున్న ‘గాడ్ ఫాదర్’కు ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా దర్శకుడు. కాగా, విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా’కు తమిళుడైన అశ్వత్ మరిముత్తు డైరెక్టర్. అయితే ఈ సినిమా మాతృకైన ‘ఓ మై కడవులే’కూ అతనే దర్శకుడు. ఇక వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘రంగరంగ వైభవంగా’ మూవీని తమిళ దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తున్నాడు. అలానే సమంత హీరోయిన్ గా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ‘యశోద’ చిత్రాన్ని తమిళ దర్శక ద్వయం హరి – హరీశ్ రూపొందిస్తున్నారు.
విశేషం ఏమంటే… తెలుగు హీరోలు తమిళ దర్శకుల చిత్రాలలో ఎలాగైతే నటిస్తున్నారో… అలానే పరభాషా కథానాయకులూ తెలుగు దర్శకుల ప్రతిభకు ఫిదా అయ్యి, పలు తెలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాంటి పలు ప్రాజెక్ట్స్ ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘లెఫ్టినెంట్ రామ్’ (వర్కింగ్ టైటిల్) మూవీని హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ ఈ మధ్యే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీని ప్రారంభించాడు. దీన్ని ‘దిల్’ రాజుతో కలిసి పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. మరో కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ అయితే ఏకంగా ఇద్దరు తెలుగు దర్శకులతో మూవీస్ చేయడానికి సై అనేశాడు. అందులో ‘సర్’ మూవీకి వెంకీ అట్లూరి దర్శకుడు. త్రివిక్రమ్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక మరొకటి శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రం. దీన్ని నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియా జంటగా నటిస్తున్న ‘మ్యూజిక్ స్కూల్’ మూవీని బియ్యాల పాపారావు డైరెక్ట్ చేస్తున్నారు. అలా అక్కడి దర్శకులతో ఇక్కడి హీరోలు, ఇక్కడి దర్శకులతో అక్కడి హీరోలు జుగల్బందీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!