గణనీయంగా పెరుగుతున్న సోనూసూద్ ఫాలోవర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు… అంతకు మించిన మానవతా మూర్తి సోనూసూద్ ను అభిమానించే వారి, అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. స్నేహితుల విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలా కరోనా కష్టకాలంలో తనకు తెలిసి వారికి, తెలియని వారికి కూడా స్నేహహస్తాన్ని అందించి మిత్రుడిగా మారిపోయాడు సోనూసూద్. అతను, అతని బృందం రాత్రింబవళ్ళు కష్టపడి వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చారు. అయితే అంతటితో తన మిషన్ ను సోనూసూద్ ఆపేయలేదు. నిజానికి ఆ తర్వాతే అతను తన పనిని మరింత విస్తారంగా, మరింత లోతుగా, మరింత ప్రభావవంతంగా చేయడం మొదలు పెట్టాడు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరీ ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను అందించడంతో సోనూసూద్ చూపిన చొరవ అద్భుతం. అందుకే మొన్నటి వరకూ నటుడిగా అతన్ని కేవలం అభిమానించిన వారు ఇవాళ అతనిలోని సేవా గుణం చూసి ఆరాధించడం మొదలు పెట్టారు. అంతేకాదు… సోనూసూద్ చెప్పే మంచి మాటలు వినడం కోసం, అతను చేస్తున్న సేవా కార్యక్రమాలకు దన్నుగా నిలవడం కోసం తమ వంతు కర్తవ్యంగా కొందరు సోషల్ మీడియాలో అతన్ని ఫాలో కావడం మొదలు పెట్టారు. అలా ఆగస్ట్ 24వ తేదీకి సోనూసూద్ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 9 మిలియన్లకు చేరింది. అంటే అక్షరాల తొంభై లక్షల మంది అతన్ని ఫాలో అవుతున్నారన్న మాట. ఈ సంఖ్య కోటికి చేరడానికి ఇంకెంతో సమయం పట్టదు!! లగే రహో సోనూసూద్!!
Also Read
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
- Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
తాజావార్తలు
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!