Site icon NTV Telugu

Sonakshi Sinha : అతని వల్లే నేను ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు.. స్టార్ హీరోయిన్ రిప్లై

Sonakshi

Sonakshi

Sonakshi Sinha : హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. పెళ్లి అయితే మాత్రం ప్రెగ్నెంట్ అయిందంటూ లెక్కలేనన్ని రూమర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విషయంలోనూ ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. ఆమెకు జహీర్ ఇక్బాల్ తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా సోనాక్షి కొంచెం బరువు పెరిగింది. అది చూసిన వారంతా ఆమె ప్రెగ్నెంట్ అంటూ నానా రకాల రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ మీడియాలోనూ ఈ రకమైన రూమర్లు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా వీటిపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

Read Also : Venkatesh : వెంకీ సరసన ఆ క్రేజీ బ్యూటీ..?

ఇందుకు తన భర్తే కారణం అంటూ తెలిపింది. తన భర్త తరచూ తినడానికి ఏదో ఒకటి తెస్తున్నాడంట. అతిగా తినడం వల్ల తాను బరువు పెరిగానని.. అది చూసి ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తన భర్తతో చేసిన వాట్సాప్ చాట్ ను బయట పెట్టింది. ఇందులో తన భర్త తినడానికి ఏమైనా తీసుకురావాలా అంటూ మెసేజ్ పెట్టాడు. నేను ఇందాకే నీ ముందే డిన్నర్ చేశాను కదా. అంటూ సోనాక్షి రిప్లై ఇవ్వడం ఇందులో మనకు కనిపిస్తుంది. మొత్తంగా సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ వార్తలపై ఆమె స్వయంగా స్పందించాల్సి వచ్చిందన్నమాట.

Read Also : Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ

Exit mobile version