Dragon : డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. తనదైన కామెడీ టైమింగ్ తో విశేషంగా అలరించాడు ప్రదీప్. తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.
Also Read : Exclusive : ‘ది ప్యారడైజ్’ ఓటీటీ డీల్ తెరవెనుక కథ
Also Read
ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రధీప్. యూత్ ను ఆకట్టుకునే కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ దాటి రూ. 150 కోట్ల దిశగా సాగుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలిజ్ డేట్ ఫిక్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న డ్రాగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ను ముందుగా చేసుకున్న ఒప్పదం ప్రకారం రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాతా అనగా మార్చి 21 న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది. తెలుగులోను సూపర్ హిట్ అయిన డ్రాగన్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!