Bedurulanka 2012: ‘సొల్లుడా శివ’ అంటున్న కార్తికేయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solluda Siva Song Relesaed: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ‘బెదురు లంక 2012’ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించగా సి. యువరాజ్ సమర్పకులుగా వ్యవరిస్తున్నారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ మొదలు పెట్టిన క్రమంలో ఈ రోజు సినిమాలో రెండో పాట ‘సొల్లుడా శివ’ను విడుదల చేశారు.
Raashii Khanna: రెచ్చిపోయిన రాశీ.. ‘చిరుత’ కళ్ళతో చెలరేగిపోయిందిగా!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
”భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా…
నువెవడివి సొల్లుడా శివా… నువెవడివి సొల్లుడా శివా…
లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుంది రా…
నువెవడివి సొల్లుడా శివా… నువెవడివి సొల్లుడా శివా…” అంటూ సాగిన ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చగా అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర ఆలపించారు. ఇక సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ సినిమాకి మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారని, ఇప్పటికే విడుదలైన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పాటకు మంచి స్పందన లభించిందని అన్నారు. ఇప్పుడీ పాటకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తుందని పేర్కొన్న ఆయన అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది అని అన్నారు. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం ‘బెదురు లంక 2012’ తీశామన్న ఆయన గోదావరి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా సినిమా ఉంటుందని అన్నారు. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే ‘బెదురు లంక 2012’ ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఆయన అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనిత నాథ్, దివ్య నార్ని ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!