Nagachaithanya : టాలీవుడ్ లో సమంత, చైతూ పేర్లు వినిపిస్తే చాలు వారి ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ మ్యాటర్ గురించి తెలుసుకుంటారు. సమంతకు సంబంధించినవి చాలానే చైతూ దగ్గర ఉండిపోయాయన్న విషయం తెలిసిందే. అందులో పెట్ డాగ్ ఒకటి. సమంత చైతూ కలిసి ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి హాష్ అనే ఓ ఫ్రెంచ్ పెట్ డాగ్ ను పెంచుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో దాంతో కలిసి వీరు దిగిన ఎన్నో ఫొటోలను షేర్ చేసేవాళ్లు. అయితే సమంతతో విడిపోయాక ఆ పెట్ డాగ్ ను చైతన్య తన వద్దే పెంచుకుంటున్నాడు. అయితే ఇన్ని రోజులు ఈ పెట్ డాగ్ ఫొటోలను షేర్ చేయలేదు. తాజాగా శోభిత, పెట్ డాగ్ లు ఆడుకుంటున్న ఫొటోలను షేర్ చేశాడు. ఆదివారం ఇలా గడిచిపోయింది అంటూ ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టాడు.
Read Also : Ameer Khan : ఎందుకూ పనికి రానని బాధపడుతున్నా : స్టార్ హీరో కుమార్తె
ఇందులో తన రేస్ కారును రిపేర్ చేసుకుంటున్నాడు. అలాగే శోభిత, పెట్ డాగ్ కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నాడు. ఈ ఫొటోలు చూసిన సమంత ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. నీకు సమంత వద్దు కానీ.. ఆమెతో ఉన్న జ్ఞాపకాలు అవసరమా అంటున్నారు. ఇంకొందరేమో సమంత ప్లేస్ ను శోభిత ఎప్పటికీ భర్తీ చేయలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా నాగచైతన్య, శోభిత ఫ్యాన్స్ మాత్రం వాళ్ల ఎంజాయ్ మెంట్ చూసి ఖుషీ అవుతున్నారు. నాగచైతన్య రీసెంట్ గానే తండేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండుతో భారీ మైథికల్ సినిమా చేస్తున్నాడు.