Small Budget Movies collecting huge collections south: చిన్న సినిమా ఊహించని విజయం సాధిస్తే ఆ ఊపు ఎలా ఉంటూనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతల్లో జోష్ వస్తుంది. స్టార్స్ ని నమ్ముకున్న మేకర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంటే కంటెంట్ నమ్ముకున్న నిర్మాతలకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగులో అంతెందుకు సౌత్ లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని స్మాల్ మూవీస్ ప్రూవ్ చేస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మద్యనే వచ్చిన సామజవరగమన.జూన్ 29న ఏమాత్రం హడావిడి లేకుండా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో 50 కోట్ల మార్క్ ని టచ్ చేయడమే కాదు యూఎస్ లో 1 మిలియన్ కలెక్ట్ చేసింది.స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ రేర్ ఫిట్ ని శ్రీ విష్ణు లాంటి మిడ్ రేంజ్ హీరో సాధించడం అంటే నిజంగా గొప్ప విషయమని చెప్పాలి. ఇక సామజవరగమన తర్వాత ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ బేబీ. రెండు సినిమాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరో హీరోయిన్స్..అయినా సినిమా హిట్ అయింది.
Hi Nanna: నాని సినిమాతో టాలీవుడ్‌కు మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ
7 కోట్లు బడ్జెట్ పెడితే ఫస్ట్ వీక్ 49.2 కోట్లు వసూళ్లు చేసి నిర్మాతలకు షాక్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ సినిమా చూడటానికి యూత్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో బేబీ సినిమా 80 నుంచి 100 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అలా టాలీవుడ్ లో బేబీ హవా నడుస్తుంటే …కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.జూలై 21న శాండల్ వుడ్ లో రిలీజైన ‘హాస్టల్ హుడు గురు బేకాగిద్దరే’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.కేజిఎఫ్ 2, కాంతార, చార్లీ తర్వాత కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి రాలేదు. జనవరిలో దర్శన్ క్రాంతి. మార్చిలో ఉపేంద్ర కబ్జ విడుదలయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఇప్పుడు ఆ గ్యాప్ ని హాస్టల్ హుడు గురు బేకాగిద్దరే రిప్లేస్ చేసింది. క్రైమ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కన్నడ నాట రచ్చ రేపుతోంది. త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.మొత్తానికి సమ్మర్ లో వచ్చిన పెద్ద బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే..కంటెంట్ నమ్ముకుని వస్తున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నాయి.