Slum Dog Husband: టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కొడుకుగా ఓ పిట్టా కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో సంజయ్ రావ్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంజయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా ఈ కుర్ర హీరో తన కొత్త చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేశాడు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా, సంజయ్, ప్రణవి మానుకొండ జంటగా తెరకెక్కిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి యక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేశాడు. లచ్చి గాని పెళ్లి ఇగ పార్శి గుట్టల లొల్లి.. లచ్చిగాని పెళ్లి నువు మర్పా కొట్టర మళ్లీ.. అంటూ సాగే ఆకట్టుకొంటుంది.
ఇక ఈ సాంగ్ ను రిలీజ్ చేసిన అనంతరం రవితేజ మాట్లాడుతూ “పాటలో చాలా జోష్ ఉందని, పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఇక ఈ సాంగ్ చూస్తుంటే హీరో హీరోయిన్ల పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు తీసినట్లు తెలుస్తోంది. బరాత్ సందడి, ఉత్సాహం అంతా ఈ పాటలో కనిపించింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా..భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి ఆలపించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో సంజయ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.