సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్’. 1979 లో సాగే ఈ పీరియాడిక్ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నారు.
Read Also : ఒక ప్రేమకథ ముగిసింది! మరో ప్రేమకథ మొదలైంది!!
ఈ సందర్భంగా దర్శకుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఆ నమ్మకంతోనే ‘స్కైలాబ్’ సినిమాను రూపొందిస్తున్నాం. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్ చానెల్స్, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్ చేశాయి. అలాంటి నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి అనే గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా ‘స్కైలాబ్’ మూవీని తెరకెక్కించాం” అని అన్నారు. రీసెంట్‌గా మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో మూవీ థీమ్స్‌ను రికార్డ్ చేయించామని, త్వరలోనే తమ ‘స్కైలాబ్’ థియేటర్స్‌లో క్రాష్ అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు.