టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నానిలా కోలీవుడ్‌లో జోవియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శివకార్తీకేయన్. నాని ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న టైంలోనే అక్కడ కూడా శివకార్తీకేయన్ యాక్షన్ హీరోగా మేకోవర్ అవతున్నాడు. రీసెంట్లీ అమరన్‌తో రూ. 300 క్రోర్ క్లబ్ లోకి చేరిన ఈ స్టార్ హీరో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అమరన్ తర్వాత శివకార్తీకేయన్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ఫ్యామిలీ ఓరియెంట్, యూత్ ఎంటరైనర్ల కన్నా యాక్షన్ చిత్రాలకే మొగ్గు చూపుతున్నాడు. ఎస్కే 25 గా తెరకెక్కుతోన్న పరాశక్తి పొలిటికల్ డ్రామాగా వింటేజ్ స్టోరీగా తెరకెక్కుతోంది. అలాగే ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో మదరాసి రూపుదిద్దుకుంటోంది.
Also Read : Kollywood : తన పేరు నుండి తండ్రి పేరు తీసేసిన యంగ్ హీరో
మదరాసి ఫక్తు యాక్షన్ త్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది.ఇక ఇవే కాకుండా మరికొన్ని సినిమాలకు శివకార్తీకేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 2018తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జుడే ఆంటోనీ జోసెఫ్ మూవీకి కమిటయ్యాడని సమాచారం. ఇది కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే గోట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో మూవీకి కమిటయ్యాడు శివకార్తీకేయన్. ఇది కూడా యాక్షన్ జోనర్ మూవీగానే ఉండబోతుంది. ఇవే కాకుండా గుడ్ నైట్ ఫేం వినాయక్ చంద్రశేఖరన్ సినిమాకు శివ ఓకే చెప్పాడని సమాచారం. ఈ సినిమాలన్నీ ఎక్కువగా మాస్ ఆడియన్స్ దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయోగాల్లానే కనిపిస్తున్నాయి. అమరన్ హిట్టుతో ఇమేజ్ పెరగడంతో కలెక్షన్లు రావాలంటే మాస్ ఇమేజ్ ఉండాలని భావిస్తున్నాడు శివ కార్తీకేయన్. రీసెంట్లీ నాని కూడా హిట్ 3, ప్యారడైజ్‌తో ఊరమాస్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు కోలీవుడ్ లో ఈ ఫ్యామిలీ స్టార్ హీరో కూడా ఇదే దారిలో వెళ్లిపోతున్నాడు.