Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ సక్సెస్ ట్రాక్ తప్పేసింది. అమరన్‌తో రూ. 300 కోట్ల హీరోగా ఎదిగాడు శివ. ధనుష్, సూర్య, అజిత్ లాంటి స్టార్ హీరోలకు సాధ్యం కానీ ఫీట్ అందుకున్నాడు. నెక్ట్స్ సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఇతడిలో పుష్కలంగా ఉన్నాయని ఫీలయ్యారు తమిళ తంబీలు. కట్ చేస్తే పేలవమైన స్క్రిప్ట్స్ ఎంచుకుని తన ఎదుగుదలను తనే తొక్కేసుకున్నాడు.
అమరన్ తర్వాత వచ్చిన మదరాసి అండ్ పరాశక్తి ఆల్ట్రా డిజాస్టర్స్‌గా మారాయి. ఏఆర్ మురుగుదాస్ అండ్ సుధాకొంగర శివకార్తీకేయన్ కేపబులిటీకి తగ్గ సినిమాలివ్వడంలో తడబడ్డారు. యాక్చువల్లీ ఈ రెండు కథలు శివ చేయాల్సింది కాదు. మదరాసి కథను షారూక్‌కు వినిపించాడు.. విజయ్ దళపతితో తీయాలనుకున్నాడు కానీ సెట్ కాలేదు. చివరకు శివకార్తీకేయన్ దగ్గరకు వచ్చింది. ఇక పరాశక్తి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్యతో పురాణనూర్ అనే పేరుతో ఎనౌన్స్ చేసింది సుధా కొంగర. కానీ ఆ ప్రాజెక్ట్ నుండి సూర్య అండ్ ఇతర టీమ్ తప్పుకోవడంతో శివకార్తీకేయన్ బలయ్యాడు. శివకార్తీకేయన్ ప్రస్తుతం సేయాన్ చేస్తున్నాడు. థాయి కిళవితో ఫ్రూవ్ చేసుకున్న శివకుమార్ మురుగేషన్‌కు ఛాన్స్ ఇచ్చాడు హీరో. వెంకట్ ప్రభుతో కూడా ఓ మూవీకి కమిటయ్యాడు. ఈ రెండు చేతిలో ఉండగానే.. ఎస్కే27 స్టార్ట్ చేశారు. పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకుడు. పార్కింగ్ తర్వాత రామ్ శింబుతో మూవీ ఎనౌన్స్ అయ్యింది. కానీ ఫుల్ స్క్రిప్ట్ నచ్చక శింబు క్విటయ్యాడు. ఆ ప్లేసులో శివ బుక్కయ్యాడు. శింబు 49లో నటించాల్సిన కయాదు లోహార్.. ఇప్పుడు ఎస్కే27లో ఫిక్సైనట్లు సమాచారం. ఆల్రెడీ స్టార్ హీరోలు వద్దన్న కథతో చేతులు కాల్చుకున్నా.. శివకార్తీకేయన్ మళ్లీ ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఈ సారి వర్కౌట్ అవుతుందో లేదో లెట్స్ వెయిట్.
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజావార్తలు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?