Site icon NTV Telugu

Sitara Ghattamaneni: లండన్ వీధుల్లో ఘట్టమనేని వారసురాలు..

Sithara

Sithara

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే మహేష్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. ప్రస్తుతం సితార 10 ఏళ్ళు పూర్తిచేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సీతూపాప.. పుట్టినప్పటి నుంచే సెలబ్రిటీగా మారిపోయింది. పదేళ్లకే PMJ జ్యూవెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఔరా అనిపించింది. ఇక ఆ యాడ్ కు వచ్చిన పారితోషికాన్ని మొత్తం ఛారిటీ కి ఇచ్చి తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు అందుకుంది. నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను, కుటుంబంతో తాను గడిపిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక తాజాగా లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సీతూ పాప పోస్ట్ చేసింది. లండన్ వీధుల్లో క్యాజువల్ డ్రెస్ లో గొడుగు పట్టుకొని సితార ఫోటోలకు ఫోజులిచ్చింది. అక్కడ కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Sai Dharam Tej: పవన్ ఎంట్రీ అప్పుడే.. మీ చొక్కాలు చింపుకోండి కానీ పక్కనోళ్ళవి కాదు!

ఇక సితార విషయం పక్కన పెడితే .. మహేష్ బాబు త్వరగా వెకేషన్ పూర్తిచేసుకొని వస్తే బావుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. కొన్నిరోజుల నుంచి గుంటూరుకారం సినిమా గురించిన చాలా వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే. సినిమా నుంచి ఒక్కొక్కరుగా తప్పుకోవడం, ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ విషయాలేమి పట్టించుకోని మహేష్ .. వెకేషన్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. ఆయన త్వరగా ఇండియా వస్తే.. అసలు షూటింగ్ మొదలవుతుందా.. ? లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది అని అభిమానులు అంటున్నారు. మరి మహేష్ ఎప్పుడు ఇండియా వస్తాడో చూడాలి.

Exit mobile version