Sita Ramam: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఒక కీలక పాత్రలో నటించింది. ఆగస్టు 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలక్షన్లను రాబడుతోంది. ఇక నాలుగు వారాల తరువాత ఈ సినిమా ఓటిటీలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి తొలగించిన సన్నివేశాలను ఒక్క్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో రష్మిక పాకిస్థాన్ యువతి అఫ్రీన్ పాత్రలో కనిపించిన విషయం విదితమే. ఇండియా అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ, తాత కోరిక మేరకు సీత, రామ్ లను కలిపే బాధ్యత తీసుకొంటుంది. ఆ సమయంలోనే సీత కోసం నూర్జహాన్ కాలేజ్ కు వెళ్తుంది. అక్కడ సీత గురించి తెలుసుకొని బయటికి రాగానే క్యాబ్ డ్రైవర్ తో ఇండియాను తక్కువ చేసేలా మాట్లాడుతోంది.
“పర్లేదు.. మీ దేశంలో ఇలాంటి వారు కూడా ఉన్నారన్నమాట అంటూ పొగరుగా మాట్లాడుతోంది. అందుకు క్యాబ్ డ్రైవర్.. ఇక్కడ నాలాంటి వారే ఉంటారు. మీ బ్యాగ్ తీసుకొని మా దేశం పరువు మీతో పంపలేము కదా మేడం అని చెప్పడం.. బ్యాగ్ లో అన్నీ ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోమని క్యాబ్ డ్రైవర్ ఇంగ్లిష్ లో చెప్పడంతో సీన్ ముగుస్తోంది. ఈ సీన్ ను సినిమా నుంచి తొలగించారు. ఒకవేళ ఈ సీన్ సినిమాలో ఉంటే కాంట్రవర్సీ అవుతుందేమో అని అలోచించి తీసేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా దేశం గురించి గొప్పగా చెప్పే మాటలే ఉన్నాయి ఈ సీన్ లో.. ఇది కూడా ఉండి ఉంటే రష్మిక పాత్ర మరింత హైలైట్ అయ్యేదని ఇంకొందరు అంటున్నారు. ఏదిఏమైనా ఈ సీన్ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.