Sir: జీవన సారాన్ని తెలిపిన ధనుష్ ‘బంజారా’ గీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: శ్రీ శ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. ఆయన ‘నేను సైతం’ అంటూ ప్రేక్షకులలో ఆవేశాన్ని రగిలించగలరు! ‘సారంగ దరియా’ అంటూ యువత నాట్యం చేసేలా చేయగలరు!! అటువంటి సుద్దాల అశోక్ తేజ కలం నుండి జీవన సారాన్ని తెలిపే అద్భుతంగా ‘సార్’ చిత్రం రూపంలో శ్రోతల ముందుకు మంగళవారం వచ్చింది.
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో ‘సార్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య కూడా భాగస్వామి. అలానే శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. మరో వైపు చిత్రంలోని పాటలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఓ గీత విడుదల కాగా, తాజాగా ‘బంజారా’ గీతాన్ని రిలీజ్ చేశారు. “ఆడవుంది నీవే ఈడ ఉంది నీవే / నీది కానీ చోటే లేనేలేదు బంజారా / యాడ పుట్టె తీగ యాడ పుట్టె బూర / తోడు కూడినాక మీటిచూడు తంబూర”
అంటూ సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. “ఏదీ మన సొంతం కాదు. కష్టాలు, సుఖాలు శాశ్వతం కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం” అనే అర్థమొచ్చేలా పదునైన మాటలతో, లోతైన భావంతో ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సుద్దాల అద్భుతమైన సాహిత్యానికి అంతే అద్భుతమైన జి వి ప్రకాష్ సంగీతం, అనురాగ్ కులకర్ణి స్వరం తోడై పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
Also Read
- Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
తాజాగా విడుదలైన ‘బంజారా’ లిరికల్ వీడియో సైతం ఆకట్టుకుంటోంది. అందులోని లోకేషన్లు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. కథానాయకుడు ఊరిలో వాళ్ళతో కలిసి నాట్యం చేయడం, రోడ్డు పక్కన హోటల్ నుండి బయటకు వచ్చాక అక్కడున్న చిన్నారికి డబ్బు సాయం చేయడం వంటివి అతని పాత్ర తీరుని, స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. ఈ లిరికల్ వీడియోలో పెళ్లి బృందంతో కలిసి సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్, గాయకుడు అనురాగ్ కులకర్ణి నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీతానికి తగ్గట్లుగా నృత్య దర్శకుడు విజయ్ బిన్ని అందించిన నృత్య రీతులు ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాట గురించి సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, “జీవితం వెనుక ఉన్న వేదాంతాన్ని, జనన మరణాల మధ్య ఉన్న బతుకు బాట, దాని పరమార్థాన్ని చిత్ర కథానుసారం చెప్పే ప్రయత్నం చేశాం. భగవంతుడు మనకు ఏమీ చేయట్లేదని అనుకోవద్దు. నీకోసం ఒక స్థానం పెట్టాడు. అక్కడికి చేరుకోవటం నీ భాధ్యత అని చెప్పే పాట ఇది. బతుకు ప్రయాణం గురించి పాట కావాలని, చిత్ర కథ, సందర్భం దర్శకుడు చెప్పిన తీరు నచ్చింది. ఆది శంకర తత్వాన్ని, భగవద్గీత సారాన్ని దృష్టి లో ఉంచుకుని ఈ గీతానికి సాహిత్యం అందించటం జరిగింది” అని అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ 17 ఫిబ్రవరి, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ‘ఆడుకాలం’ నరేన్, ఇలవరసు, ‘మొట్టా’ రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!