ప్రముఖ గాయని సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి మాత్రమే కాదు సునీత ఏం చేసినా సంచలనమే. ఆమె వేసే ప్రతి అడుగునూ అభిమానులు, నెటిజన్లు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. అయితే ఇప్పుడు సింగర్ సునీత వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఆసక్తికరంగా మారింది. రంగంలోకి వారసుడిని దింపబోతోందట. సునీత కుమారుడు ఆకాష్ త్వరలో టాలీవుడ్లో లీడ్ యాక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు సంచలనంగా మారాయి.
Read Also : “ఎస్ఎస్ఎంబి 28” అప్డేట్… గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?
త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఈ ప్రాజెక్ట్‌కి రామ్ వీరపనేని నిర్మాతగా వ్యవహరించబోతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఆకాష్ విషయానికొస్తే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అయితే ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఆకాష్ నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. త్వరలో ఆకాష్ గ్రాండ్ డెబ్యూ జరగనుందని తెలుస్తోంది.