Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!” ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సమాజంలో ఫెమినిజం, విమెన్ రైట్స్ పేరుతో జరుగుతున్న కొన్ని డిబేట్లపై సింగర్ సునీత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బట్టలు వేసుకోవడం, సిగరెట్లు తాగడం ఫెమినిజం కిందకు రాదని, అది కేవలం స్టూపిడిటీ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె “ఈ రోజుల్లో సిగరెట్ లైటర్‌ను ఫ్రీడమ్‌కు టార్చ్ బేరర్ లాగా చూస్తున్నారు. సిగరెట్ తాగడాన్ని ఈక్వాలిటీ అనుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖత్వం. మగవాడు సిగరెట్ తాగితే వాడి జీవితంలో కొన్ని నిమిషాలు తగ్గుతాయేమో, కానీ అదే సిగరెట్ ఒక ఆడపిల్ల తాగితే ఆవిడ లైఫ్ లో నుంచి 12 గంటల ఆయుష్షు వెళ్ళిపోతుంది. మగవాళ్లతో ఇలాంటి వాటిల్లో ఈక్వాలిటీ వెతుక్కోవడం ఏంటి? అలాగే బట్టల విషయంలో ‘మై బాడీ మై రైట్’ (నా శరీరం నా ఇష్టం) అని అమ్మాయిలు స్లోగన్స్ ఇస్తున్నారు. సరే.. నీ శరీరం నీ ఇష్టమైనప్పుడు, ‘హిస్ ఐస్ హిస్ రైట్’ (వాడి కళ్ళు వాడి ఇష్టం) కదా! వాడి చూపును నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? బిల్లియన్ల మంది మనుషుల చూపులను మార్చడం కంటే, మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ఈజీ మెథడ్ కదా” అని సునీత అన్నారు.
నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడమే ఫెమినిజం అంటే నాకు నవ్వొస్తుంది అని సునీత అన్నారు. “నిజమైన ఈక్వాలిటీ అంటే ఒక ఇంట్లో లేదా సమాజంలో ఒక ఆడది మైక్ పట్టుకుని ఒక అభిప్రాయం చెప్తే, దానికి మగవాడు ఎంతవరకు విలువ ఇస్తున్నాడు? ఆమె ఆలోచనా విధానాన్ని గౌరవిస్తున్నారా లేదా? అనే దానిపై పోరాడాలి. కానీ బట్టల పరిధి పెంచుకోవడాన్ని ఫ్రీడమ్ అనరు. ఆడవాళ్లు, మగవాళ్లు సమానం కాదు.. ఇద్దరి కంపోజిషన్ వేరు, నేచర్ వేరు. ఒకరితో ఒకరిని కంపేర్ చేయకూడదు” అని సునీత తేల్చి చెప్పారు.
Also Read
- Samantha: సింగిల్స్‌కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
- Singer Sunitha: సినీ ఇండస్ట్రీ స్త్రీలకు సేఫ్ కాదు: సింగర్ సునీత
- Aishwarya Lekshmi: ఇండస్ట్రీలో అరుదైన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్! ఆ ఆలోచన లేదట..
- Mirzapur: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మిర్జాపూర్ పోస్టర్స్! మున్నా భాయ్ మళ్లీ వస్తున్నాడా?
తాజావార్తలు
-
Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!” ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!
-
Samantha: సింగిల్స్‌కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
-
Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
-
Usha Vance: మత మార్పిడిపై ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు
-
Samantha: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత!!
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!