బిగ్ బాస్ తమిళ్ OTT వెర్షన్ “బిగ్ బాస్ అల్టిమేట్” పేరుతో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో కొత్త హోస్ట్‌ని ఇప్పుడు పరిచయం చేశారు మేకర్స్. ఇప్పటి వరకూ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ కొన్ని అనివార్య కారణాల వల్ల షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. షో నుండి నిష్క్రమిస్తున్నట్లు వారాంతపు ఎపిసోడ్‌లో ప్రకటించిన తర్వాత కమల్ హాసన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ఆయన “బిగ్ బాస్ అల్టిమేట్”లో పాల్గొంటే తన నెక్స్ట్ సినిమాలకు షూట్ చేయడం అసాధ్యం కాబట్టి షో నుండి వైదొలగడం తప్ప తనకు వేరే మార్గం లేదని పేర్కొన్నాడు. ఆరవ సీజన్‌కు షో హోస్ట్‌గా తిరిగి వస్తానని కమల్ వాగ్దానం చేశాడు.
Read Also : Alia Bhatt : గంగూబాయ్ కి సుప్రీమ్ కోర్టులోనూ ఊరట!
ఇక తాజాగా ఈ షోకు హోస్ట్ గా శింబు (సిలంబరసన్ థెసింగు రాజేంద్ర – STR)ను సెలెక్ట్ చేశారు షో మేకర్స్. OTT షో కొత్త హోస్ట్‌ను ప్రకటించడానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈరోజు సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. ప్రమోషనల్ వీడియోలో శింబు పూర్తిగా కొత్త అవతార్‌లో కన్పించాడు. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా బహుముఖ నటుడు కమల్ హాసన్ “విక్రమ్”, “ఇండియన్ 2” ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు తన రాబోయే చిత్రం “వెందు తానిందతు కాదు” షూటింగ్‌లో చాలా భాగాన్ని ముగించాడు.