Siddu Jonnalagadda: తెలుసు కదా అంటున్న టిల్లు..ఈసారి కూడా రచ్చే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddu Jonnalagadda Neeraja Kona Film Titled as Telusu Kada: వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా తన కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుందని చెబుతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా కానుంది. ఇక భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. నిజానికి ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అందుకు తగ్గట్టుగానే సినిమాను అధికారికంగా ప్రకటించగా సినిమాకి ‘తెలుసు కదా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా పూర్తి విందు భోజనం అందించబోతుందని అనౌన్స్ మెంట్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.
Saindhav : సైకో గా వెంకటేష్.. ఆసక్తి రేకెత్తిస్తున్న సైంధవ్ టీజర్..
Also Read
- Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
- Donga Naa Koduku: జాగ్రత్త.. 'దొంగ నా కొడుకు' వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
- Nani - Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
- SS Rajamouli: 'బాహుబలి', 'RRR' కాదు.. రాజమౌళి బెస్ట్ మూవీ ఇదేనట!
ఇంకా ఆ వీడియోలోని విజువల్స్ చాలా గ్రాండ్‌గా వున్నాయి, టాప్ క్లాస్ ప్రొడక్షన్ తో, సాంకేతిక ప్రమాణాలతో అనౌన్స్ మెంట్ కాన్సప్ట్ అయితే యూనిక్ గా ఉంది. సోల్‌ఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా సిద్దుని సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేస్తుంది. ఇక ఈ వీడియోలో భావోద్వేగాలతో పాటు సోషల్ ఎలిమెంట్స్, రిలేషన్స్ ఉంటాయని కొంత క్లారిటీ ఇచ్చినట్టు అయింది. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ డీవోపీ యువరాజ్ జె ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి అర్చన రావు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మరికొద్ది వారాల్లో షూటింగ్ కి వెళ్లనుంది.
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..