NTV Telugu Site icon

Siddu Jonnalagadda: తెలుసు కదా అంటున్న టిల్లు..ఈసారి కూడా రచ్చే!

Telusu Kada

Telusu Kada

Siddu Jonnalagadda Neeraja Kona Film Titled as Telusu Kada: వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా తన కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుందని చెబుతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా కానుంది. ఇక భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. నిజానికి ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అందుకు తగ్గట్టుగానే సినిమాను అధికారికంగా ప్రకటించగా సినిమాకి ‘తెలుసు కదా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా పూర్తి విందు భోజనం అందించబోతుందని అనౌన్స్ మెంట్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.

Saindhav : సైకో గా వెంకటేష్.. ఆసక్తి రేకెత్తిస్తున్న సైంధవ్ టీజర్..

ఇంకా ఆ వీడియోలోని విజువల్స్ చాలా గ్రాండ్‌గా వున్నాయి, టాప్ క్లాస్ ప్రొడక్షన్ తో, సాంకేతిక ప్రమాణాలతో అనౌన్స్ మెంట్ కాన్సప్ట్ అయితే యూనిక్ గా ఉంది. సోల్‌ఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా సిద్దుని సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేస్తుంది. ఇక ఈ వీడియోలో భావోద్వేగాలతో పాటు సోషల్ ఎలిమెంట్స్, రిలేషన్స్ ఉంటాయని కొంత క్లారిటీ ఇచ్చినట్టు అయింది. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ డీవోపీ యువరాజ్ జె ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి అర్చన రావు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మరికొద్ది వారాల్లో షూటింగ్ కి వెళ్లనుంది.

Show comments