నేచురల్ స్టార్ నాని “శ్యామ్ సింగ రాయ్” ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించగా, నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 150 కోట్ల బడ్జెట్తో రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” సినిమాకు సంబంధించి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ట్విట్టర్లో నాని “శ్యామ్ సింగ రాయ్” గురించి ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని అభిమానులు సినిమా బాగుంది అంటే… సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
ట్విటర్ లో నడుస్తున్న టాక్ ప్రకారం సినిమా ప్రథమార్థం ఇంటరెస్టింగ్ అని, సెకండాఫ్ యావరేజ్ అని అంటున్నారు. నాని ఎప్పటిలాగే నేచురల్ గా నటించాడని, సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం ప్రధాన హైలెట్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంచనాలను అందుకోలేదని ట్వీట్స్ చేస్తున్నారు. కానీ నాని అభిమానులు మాత్రం టాలీవుడ్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, శ్యామ్ సింగ రాయ్’ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్ టాక్ ప్రకారం ప్రథమార్థం 20 నిముషాలు కథ కాస్త నెమ్మదించింది. తర్వాత కథ పికప్ అందుకోగా, ప్రీ ఇంటర్వెల్ సీన్స్, 2వ సగం బాగున్నాయి. నాని నటన, డైలాగ్స్, బెస్ట్ టెంపుల్ ఫైట్ సాంగ్స్, సాయి పల్లవి బెస్ట్ పెర్ఫార్మెన్స్, పాటలు సినిమాలో హైలెట్స్. రాహుల్ డైరెక్షన్ యావరేజ్, మొత్తానికి సినిమా హిట్ అనేది మాస్ ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుందని నెటిజన్ల అభిప్రాయం.