Shubhalekha Sudhakar:ఒకప్పుడు రివటలా ఉండే 'శుభలేఖ' సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ పతిదేవుడు 'శుభలేఖ' సుధాకర్. ఇద్దరూ గళంతో భలేగా ఆకట్టుకుంటున్నారు. గాయనిగా ఆమె, నటునిగా ఈయన సాగుతున్నా, డబ్బింగ్…