స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం ఆమె ప్రియుడు మైకేల్ తో విడిపోయాక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు కూడా కొత్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు క్రాక్ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరోపక్క కొత్త ప్రియుడు ర్యాపర్ శంతను హజరికాతో పీకల్లోతు ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తుంది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని శంతను చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ” శృతి, నేను చాలా క్రియేటివ్ పీపుల్.. మా ఇద్దరికి క్రియేటివ్ గా ఎప్పుడో పెళ్లైపోయింది. అందుకు నిదర్శనం మా బంధమే.. మా ఇద్దరికి నచ్చే విషయం ఒకటే.. ఇద్దరం చాలా కొత్తగా ఆలోచిస్తాం. ఆమె నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది.. నన్ను చూసి ఆమె కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటుంది. ఇక మా పెళ్లి ప్రత్యేక్షంగా ఎప్పుడు జరుగుతుందో నేను కూడా చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శృతి ప్రభాస్ సరసన సలార్, బాలకృష్ణ సరసన గోపీచంద్ మలినేని చిత్రంలో నటిస్తుంది. ఇవి కాకుండా ఇటీవలే చిరు సరసన మెగా 154లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
