Shruti Haasan: శృతి హాసన్.. ప్రస్తుతం సంక్రాంతి సినిమాలన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి. సంక్రాంతి హీరోలు ఎవరు హిట్ కొట్టినా హీరోయిన్ గా ఆమె కూడా హిట్ అందుకున్నట్లే. చిరు సరసన వాల్తేరు వీరయ్యలో, బాలయ్య సరసన వీరసింహారెడ్డి చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి పోటా పోటీగా నిలవనున్నాయి. ఇక ఇప్పటికే రిలీజైన ఈ రెదను సినిమాల ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి.
కాగా, మొన్ననే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా జరిగింది. బాలయ్య తో పాటు శృతి హాసన్ స్పెషల్ ఛాఫర్ లో వెళ్లి ఈవెంట్ లో పాల్గొన్నారు. బాలయ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, ఆయనతో పనిచేయడం తన అదృష్టమని శృతి చెప్పుకొచ్చింది. ఇక నేడు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ-ఏయు గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ ఈవెంట్ లో శృతి, చిరు గురించి ఏం మాట్లాడుతుందో అని ఎదురుచూస్తున్న వేళ ఆమె చేదు వార్తను చెప్పుకొచ్చింది.
Read Also: TSRTC ZIVA Drinking Water: టీఎస్‌ఆర్టీసీ ‘జీవా’ వాటర్ బాటిళ్ల విక్రయం రేపే ప్రారంభం
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తాను రావడం లేదని బాధాతప్త హృదయంతో చెప్పుకొచ్చింది. “అనారోగ్యం కారణంగా నేను వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు రాలేకపోతున్నాను. ఈ విషయం చెప్పడానికి నా హృదయం ముక్కలవుతుంది. నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. అందుకే ఈరోజు రాలేకపోతున్నాను. చిరంజీవి గారితో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చిత్ర బృందం మొత్తం ఈ ఈవెంట్ ను మనసారా ఆనందించండి” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శృతి అభిమానులు కొద్దిగా నిరాశకు గురయ్యారు. మరోపక్క ఆమె హెల్త్ కు ఏమయ్యిందో అని ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.