Site icon NTV Telugu

‘సలార్’ అప్డేట్… ఆద్యను పరిచయం చేసిన టీం

ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కూడా పోస్టర్స్ రూపంలో ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నారు మేకర్స్. క్రమంలోనే శృతి నెక్స్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు, ‘సలార్’లో ప్రభాస్ కు జోడిగా కనిపించనుంది శృతి. ఇక ఈ బర్త్ డే ప్రత్యేక పోస్టర్‌లో శృతిని ఆద్యగా పరిచయం చేశారు. ఆమె సాధారణ కుర్తాలో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శృతి లుక్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

Read Also : లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా తందనాన’ టీజర్

స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ శృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే శృతి హాసన్. సలార్‌లో భాగమైనందుకు, సెట్స్‌కి కొంచెం కలర్ ను తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు!” అంటూ ట్వీట్ చేశారు. ‘సలార్‌’ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

https://twitter.com/prashanth_neel/status/1486919462729125889
Exit mobile version