Site icon NTV Telugu

Shriya Sharma : సమంత చెల్లెలు.. ఇప్పుడు టాప్ లాయర్..

Shriya

Shriya

Shriya Sharma : ఏంటి సమంత చెల్లెలు టాప్ లాయరా.. అసలు ఆమెకు చెల్లెలు కూడా ఉందా అని డౌట్ పడకండి. ఉంది కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్‌ లో. ఆమె సమంతకు చెల్లెలే కాదు చిరంజీవికి మేన కోడలు. మెగాస్టార్ నటించిన జై చిరంజీవి సినిమాలో చిరంజీవి మేనకోడలు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమెనే శ్రియాశర్మ. ఆ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. మహేశ్ బాబు దూకుడు సినిమాలో సమంతకు చెల్లెలి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ స్కూల్ లో హీరోయిన్ గా నటించింది.

read also : Rajasab : ‘ది రాజాసాబ్’ సినిమాలో సడెన్ ట్విస్ట్..!

ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయింది. ఏమైందా అని చూస్తే టాప్ లాయర్ గా ఎదిగిపోయింది. శ్రియశర్మ వయసు ఇప్పుడు 26 ఏళ్లు. ప్రస్తుతం దేశంలోని టాప్ కార్పొరేట్ కంపెనీలకు లాయర్ గా పనిచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. చూడటానికి హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం ఈమె సొంతం. అందుకే ఆమెకు ఈ స్థాయి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు 4.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోలను పోస్టు చేస్తూ చాలా ఫాలోయింగ్ పెంచేసుకుంది ఈ బ్యూటీ. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటూ ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

read also : Sunny Leone : కత్తిలాంటి అందాలతో సన్నీలియోన్ రచ్చ..

Exit mobile version