శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తూ వస్తుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఈమె సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. కూతురితో పాటు చేసే అల్లరిని, బికినీ లు వేసుకొని బీచ్ లో ఎంజాయ్ చేసినవి, భర్తకు నడిరోడ్డుపై లిప్ లాక్ ఇచ్చేవి అన్ని ఫ్టోలను షేర్ చేస్తూ ఒక రేంజ్ లో దుమారం రేపుతోంది. ఇక తాజాగా శ్రీయ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఫోటోపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
ఇటీవల ఆమె కుటుంబంతో కలిసి ఒక ఆర్ట్ గ్యాలరీ సందర్శించింది. అక్కడ ఒక మహిళ నగ్న ఫోటో ఉండగా.. ఆమె దాని ఎదురు నిలబడి చేత్తో ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ పోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీఛీ నీకు సిగ్గులేదు.. ఒక మహిళ వి అయ్యి ఉండి .. మరో మహిళ నగ్న ఆర్ట్ చూసి నవ్వుతున్నావా..? అని కొందరు.. ఇలాంటి ఫోటోలు షేర్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావ్ అని మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇంకొందరు మాత్రం శ్రీయ ను సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఒక అందమైన ఆర్ట్ ను చూసింది.. దానితో ఫోటో దిగింది.. అందులో తప్పేముంది.. అదేమైనా ఆమె గీసి అందరికి చూపిస్తుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక శ్రీయా కెరీర్ విషయానికొస్తే హిందీలో దృశ్యం 2 లో అజయ్ దేవగన్ సరసన నటిస్తోంది.. ఇది కాకుండా ఆమె చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.