OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీమ్. రోజుకొక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ నుంచి శ్రియారెడ్డి పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె తుపాకీ ఎక్కుపెట్టి చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించలేదనే చెప్పుకోవాలి. పైగా పవన్ కల్యాణ్ సినిమాలో ఒక లేడీకి ఇంత పవర్ ఫుల్ రోల్ అంటే మామూలుగా ఉండదు కదా. ఓజీ సినిమా పూర్తిగా గ్యాంగ్ స్టర్ పాత్ర నేపథ్యంలోనే రాబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Nagarjuna : నాగార్జునను కలిసిన బండారు దత్తాత్రేయ..
అందులో భాగంగానే పాత్రలు కూడా పూర్తి వైలెంట్ గానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మొన్న ప్రకాశ్ రాజ్ పాత్ర పోస్టర్ ను వదిలారు. తాజాగా శ్రియారెడ్డి ఫొటోను వదిలారు. మరి ఆమె లేడీ విలన్ రోల్ ఏమైనా చేస్తుందా లేదంటే పాజిటివ్ పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. అయితే శ్రియారెడ్డి పాత్రపై మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇలా సడెన్ పోస్టర్లతో పాత్రలను పరిచయం చేస్తున్నారు మూవీ టీమ్. ఇక రేపు ఓజీ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. దానికి పవన్ కల్యాణ్ వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రేపు సాయంత్రం ఎల్బీస్టేడియంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటేయిల్స్ త్వరలోనే బయటకు వదలబోతున్నారు.
Read Also : OG : ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే
