Shriya Reddy Kontham Looks then and now: మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో నేచురల్ స్టార్ నాని ఒక సినిమా చేశారు. ఐదుగురు ఆడవాళ్లు.. ఒక్కొక్కరిది ఒక్కో వయసు చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు రకరకాల వయసుల వారు అంతా కలిసి వెళ్లగా అలాంటి వాళ్లకు నాని ఎలా గ్యాంగ్ లీడర్ అయ్యాడు వాళ్ల కోసం ఆయన ఏంచేశారు అనేలా ఆ సినిమా రూపొందింది. నాని ‘పెన్సిల్’ పార్థసారథి అనే రచయితగా కనిపించిన ఈ సినిమాలో ఐదుగురు మహిళా పాత్రలలో శ్రియా రెడ్డి ఒకరిగా నటించింది. అయితే ఆమె సినిమా ప్రమోషన్స్లో ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆమె సినిమా షూ పూర్తి అవగానే అమెరికాలోని బోస్టన్‌కి వెళ్లి అక్కడ ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది.
Vidhi: కంటి చూపులేని వాళ్లు కూడా థియేటర్‌లో ఎంజాయ్ చేసే ‘విధి’
హైదరాబాద్‌లో జన్మించిన తార్నాకకు చెందిన శ్రేయ రెడ్డి 9వ తరగతి చదువుతున్నప్పుడు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. ఆమెకు ఎప్పుడూ నటనపై ఆసక్తి ఉంది, కానీ ఆమె తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. నటనపై తనకున్న ఆసక్తి, అది సినిమాలకు దారితీసిన తీరు గురించి చెబుతూ.. ”నేను ఐదో, ఆరో తరగతిలో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి థియేటర్‌లో నటించానని, అప్పట్లో నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులకు వెళ్లేదాన్ని అక్కడే ఆ నాటక దర్శకుడితో పరిచయం ఏర్పడింది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్ చేశా అక్కడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ నన్ను చూసి దర్శకుడు విక్రమ్ కుమార్ కి నా ఫోటోలు చూడమని సూచించగా నన్ను పిలిచి వెంటనే ఎంపిక చేశారని ఆమె గతంలో చెప్పుకొచ్చింది. అయితే ఒకప్పుడు టీనేజ్ లో కనిపించిన ఆమె ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.