NTRNEEL : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతోంది. మొన్నటి దాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే రుక్మిణీ వసంత్ నటిస్తుందనే టాక్ ఎక్కువగా వచ్చింది. ఆమె పేరుపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరోయిన్ ను ఇందులోని సెకండ్ హాఫ్ కోసం తీసుకుంటున్నారంట. సెకండ్ హాఫ్ లో కీలక పాత్ర కోసం ఆమెను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read Also : Eatala Rajendar: హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారు..
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బడా హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఆమెకు ఇప్పటికే ప్రశాంత్ నీల్ స్టోరీ గురించి చెప్పగా దాదాపు ఓకే చెప్పేసిందంట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ కు అటు బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఇందులో తీసుకుంటే బిజినెస్ పరంగా కూడా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రద్ధా కపూర్ మొన్ననే స్త్రీ-2 సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో ఆమె నటిస్తే మూవీకి మంచి క్రేజ్ పెరుగుతుందని.. హిందీ మార్కెట్ లో ఇది బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.