హాలీవుడ్ వాళ్ల చేత కూడా జేజేలు కొట్టించుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఓ గే లవ్ స్టోరీగా పేర్కొంటూ ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూక్కుట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! తానో చెత్త సినిమా చూశానని మొదట మునీష్ భరద్వాజ్ ట్వీట్ చేస్తే.. దాన్ని రీట్వీట్ చేస్తూ రసూల్ పై విధంగా కామెంట్ చేశాడు. దీంతో, ఇది అగ్గి రాజేసింది. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ఓ వ్యక్తి, ఇలా కామెంట్ చేయడం నిజంగా ఊహించనిదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తనదైన శైలిలో రసూల్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమా ఓ గే లవ్ స్టోరీ అని నేను భావించడం లేదు. ఒకవేళ మీరు (రసూల్‌ని ఉద్దేశించి) చెప్పినట్టు ఇది గే లవ్ స్టోరీనే అనుకుంటే.. అందులో తప్పేముంది? అసలు నువ్వు దాన్నెలా సమర్థించుకుంటావ్? నీలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి దిగుజారుగు కామెంట్ రావడం నిజంగా శోచనీయం’’ అంటూ శోభు ట్వీట్ చేశారు. దెబ్బ అదుర్స్ కదూ! మరి, దీనికి రసూల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. తాను చేసిన కామెంట్‌ని తీసుకెళ్లి రసూల్ విదేశీయులపై రుద్దడమే! ‘మీరు ఈ కామెంట్ చేయడం వల్ల మీపై రెస్పెక్ట్ పోయింది’ అని ఓ నెటిజన్ పేర్కొంటే.. ‘‘వెస్ట్రన్ దేశాల్లో ఆ చిత్రాన్ని అలానే పిలుస్తున్నారు. నేను దానిని కోట్ చేశాను’’ అని పేర్కొన్నాడు. మరీ ఇంత అజ్ఞానిలా ప్రవర్తించడమేంటి?