NTV Telugu Site icon

Shobu Yarlagadda: రాజమౌళిని నాన్ ఎస్ఎస్ఆర్ అనేసిన బాహుబలి నిర్మాత

shobu yarlagadda

shobu yarlagadda

తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత రికార్డులను నాన్ బాబాలు రికార్డులతో కొలవడం మొదలుపెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా నేడు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తిరుగులేని విజయాన్ని అందుకొని జక్కన్న తన రికార్డును తనే బ్రేక్ చేశాడు. టాలీవుడ్ టాక్ ప్రకారం త్వరలోనే ఈ సినిమా బాహుబలి రికార్డులను కొల్లగొడుతుంది అంటున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించేశాడు బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ. సినిమా వీక్షించి రివ్యూ చెప్పిన ఈ నిర్మాత ఇకపై సినీ ఇండస్ట్రీలో ‘నాన్ ఆర్ఆర్ఆర్’ రికార్డులు ఉంటాయని చెప్పుకొచ్చాడు.

తొలుత `నాన్ ఆర్ ఆర్ ఆర్`  అని ప్రతిపాదించి ఆ తర్వాత ఆ క్రెడిట్ అంతా రాజమౌళికే చెందుతుంది కాబట్టి `నాన్ ఎస్ ఎస్ ఆర్` అని మార్పు చేసారు. అంటే రాజమౌళిని ఎవరైనా కొట్టాలి అంటే అది కేవలం రాజమౌళి మాత్రమే అయ్యి ఉండాలి అనే అర్థంలో శోభు చెప్పడం విశేషం. ఇక మరోపక్క ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ బాహుబలి రికార్డ్స్ దాటలేవని అంటున్నారు మరికొందరు. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలతోనే 3 మిలియన్ల డాలర్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రలో స్టార్ హీరోల హావాతో కలెక్షన్స్ రాబట్టడం అంత పెద్ద మ్యాటర్ కాదు అంటున్నారు మరికొందరు. మరి ఈ రికార్డు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.