Shobhan Babu: యన్టీఆర్ ను ఫాలో కాలేక పోయిన శోభన్ బాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shobhan Babu: నటరత్న యన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు ఎంతో అభిమానం. శోభన్ ఇంట్లో యన్టీఆర్ అతిపెద్ద చిత్రపటం ఆయన ఆఫీస్ రూమ్ లో దర్శనమిస్తుంది. రామారావు అంటే శోభన్ కు అంత అభిమానానికి కారణం, యన్టీఆర్ ‘దైవబలం’తోనే శోభన్ బాబు చిత్రసీమలో అడుగు పెట్టారు. అలాగే యన్టీఆర్, శోభన్ ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించారు. తన చిత్రం ద్వారా పరిచయమైన శోభన్ కు చిత్రసీమలో మంచి భవిష్యత్ ఉండాలని ఆశించారు. దాదాపు తాను నటించిన పాతిక చిత్రాలలో శోభన్ కు కీలక పాత్రలు ఇప్పించి, ప్రోత్సహించారు యన్టీఆర్. క్రమశిక్షణలోనూ, సమయపాలనలోనూ యన్టీఆర్ నే ఆదర్శంగా తీసుకొని సాగారు శోభన్ బాబు. అయితే ఒక్క విషయంలో మాత్రం యన్టీఆర్ ను ఫాలో కాలేక పోయానని అంటూ ఉండేవారు శోభన్. ఏమిటది?
యన్టీఆర్, శోభన్ కంటే 16 సంవత్సరాలు వయసులో పెద్దవారు. అలాగే యన్టీఆర్, కృష్ణకంటే 20 ఏళ్ళు సీనియర్. కానీ, సినిమాల్లో మాత్రం ఈ ఇద్దరికీ యన్టీఆర్ అన్నగా నటించేవారు. కృష్ణ, శోభన్ బాబు కంటే యన్టీఆర్ గ్లామర్ గా కనిపించేవారు. వీరు ముగ్గురూ కలసి ‘విచిత్ర కుటుంబం’లో నటించారు. అందులో యన్టీఆర్ తమ్ముళ్ళుగా శోభన్, కృష్ణ అభినయించారు. అప్పటి నుంచీ శోభన్, కృష్ణ పలు విషయాల్లో రామారావును అనుసరించసాగారు. యన్టీఆర్ భోజనప్రియుడు. తనకు ఇష్టమైనవి ఏ మాత్రం మొహమాటం లేకుండా లాగించేవారు రామారావు. అయినప్పటికీ యన్టీఆర్ తన గ్లామర్ ను కాపాడుకొనేవారు. శోభన్ బాబు తన అందాన్ని పరిరక్షించుకోవడానికి మితాహారం తీసుకొనేవారు. ఎక్కువగా పండ్లు, పచ్చి కూరగాయలపై ఆధారపడేవారు శోభన్. అన్ని విషయాల్లోనూ యన్టీఆర్ ను ఫాలో అయ్యారు శోభన్. రామారావు తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలూ పోషించి మెప్పించారు శోభన్. అలాగే యన్టీఆర్ తరువాత అందాల నటుడు అనీ గుర్తింపు పొందారు. ఇంతలా ఆయనను అనుసరిస్తూ సాగినా, శోభన్ బాబు మాత్రం తిండి విషయంలో యన్టీఆర్ ను ఫాలో కాలేకపోయానని అనేవారు. ఎంత తిన్నా అన్నగారి గ్లామర్ చెక్కుచెదిరిదే కాదని, అదే ఆయనలా తాము తిన్నామంటే, అంతే సంగతులు అనీ శోభన్ తరచూ చెప్పేవారు.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
-
Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
-
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’కు మెగా ప్రశంసల వర్షం..
-
TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
ట్రెండింగ్
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!