Shivaraj Kumar : కన్నడ నటి రమ్య నిన్న సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనం రేపింది. హీరో దర్శన్ అభిమానులు అసభ్యకరంగా తనకు మెసేజ్ లు పెడుతున్నారని.. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. నటి పవిత్రగౌడపై రేణుకా స్వామి చేసిన కామెంట్లకు.. ఇప్పుడు తన మీద దర్శన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లకు పెద్ద తేడా లేదంటూ వాపోయింది. ఆమె పోస్టుపై తాజాగా కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ స్పందించారు. రమ్యకు అలాంటి మెసేజ్ లు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Read Also : Kingdom : అతన్ని నాతోనే ఉంచుకోవాలని ఉంది.. విజయ్ కామెంట్స్
ఇలాంటి వాటిని అస్సలు సహించబోం. ఒక మహిళ పట్ల ఇలాంటి అసభ్యకర కామెంట్లపై ఊరుకునేది లేదు. మహిళలను ఎంతో గౌరవించుకోవాలి. ఒక అమ్మగా, తల్లిగా, చెల్లిగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. రమ్య కరెక్ట్ దారిలోనే వెళ్లోంది. నీకు మేమంతా అండగా ఉన్నాం అంటూ చెప్పారు శివరాజ్ కుమార్. రేణుకాస్వామి హత్య కేసుపై రీసెంట్ గా రమ్య ఓ పోస్ట్ పెట్టారు. దానిపై దర్శన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని బదులు నిన్ను చంపేసినా బాగుండు అంటూ ఆమెకు మెసేజ్ లు, కామెంట్లు పెట్టారు. వాటిని ఆమె స్క్రీన్ షాట్ తీసి మరీ కంప్లయింట్ ఇచ్చింది. కన్నడ నాట ఇప్పుడు దర్శన్ వ్యవహారం మళ్లీ సంచలనం రేపుతోంది.
Read Also : Prabhas : పవర్ ఫుల్ గా ఉంది.. మహావతార్ పై ప్రభాస్ ప్రశంసలు
