Site icon NTV Telugu

‘Writer Padmabhushan’: శివరాజ్ కుమార్ అభినందనలు అందుకున్న రైటర్!

Writer

Writer

Shivraj Kumar: సుహాస్ కథానాయకుడిగా నటించిన హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌’ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసి సినీ ప్రముఖులు పలువురు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ మూవీలోని కంటెంట్ లేడీస్ కు అందాలనే ఉద్దేశ్యంతో చిత్ర నిర్మాతలు ఇటీవల ఓ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలకు ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాంతో మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అయ్యింది. ఇదిలా ఉంటే… తాజాగా ‘రైటర్ పద్మభూషణ్‌’ చిత్ర యూనిట్ ను కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్ కుమార్ అభినందించారు. వారితో మాట్లాడిన అనంతరం ఆయన తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు. ”’రైటర్ పద్మభూషణ్‌’ సినిమాకి చాలా గొప్ప స్పందన వస్తున్నట్టు తెలిసింది. చక్కని సెన్సిబుల్ సినిమాకి ప్రేక్షకుల నుంచి అంతే గొప్ప స్పందన రావడం చాలా ఆనందంగా వుంది. ప్రివ్యూ షో గ్లింప్స్ చూశాను. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన నా మనసుని హత్తుకుంది. అతి త్వరలోనే సినిమా చూస్తాను. ఇంత చక్కటి సినిమాని అందించిన టీం అందరికీ అభినందనలు. సినిమా ఇంకా చూడని వారు.. ప్లీజ్ గో అండ్ వాచ్” అని కోరారు.

Exit mobile version