Shivani Nagaram : హీరోయిన్ శివానీ నగరం ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు మంచి హిట్లు కొడుతుండటంతో ఆమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. మొదట్లో చిన్న పాత్రలు కూడా చేసింది. అప్పట్లో అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇందులో నవీన్ పోలిశెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ఈ సినిమాలో శివానీ నగరం కూడా నటించింది. కాకపోతే ఆ విషయం చాలా మందికి తెలియదు.
Read Also : Teja Sajja : చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్
ఈ సినిమాలో ఆమె న్యూస్ ప్రజెంటర్ గా చేసింది. కొన్ని సెకన్ల పాటే ఉండే ఆ పాత్రను శివానీ కాదనకుండా చేసింది. అంతకు ముందు ఆమె కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది. ఆమెకు తొలి సినిమా అంటే జాతిరత్నాలు అనే చెప్పాలి. దాని తర్వాతనే ఆమె అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో తొలిసారి హీరోయిన్ గా చేసింది. ఆ మూవీ హిట్ అయింది. దాని తర్వాత రీసెంట్ గా 8 వసంతాలు సినిమాలో నటించింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీలో నటించి హిట్ అందుకుంది. తెలుగు అమ్మాయికి వరుస హిట్లు రావడంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు తెలుగు వరుస ఛాన్సులు వస్తున్నాయి ఈ బ్యూటీకి.
Read Also : Pawan Kalyan – Ram Charan – Bunny : ఒకే ఫ్రేమ్ లో పవన్, చరణ్, బన్నీ.. ఫ్యాన్స్ కు పండగే..
