Shivaji Releases a video after bigg boss 7 grand finale: బిగ్‌బాస్ సీజన్ 7 ఎన్నో ఆసక్తికర పరిణామాల అనంతరం పూర్తి అయ్యిపోయింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కైవసం చేసుకోగా అమర్ రన్నరప్ గా నిలిచాడు. ఇక శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని ముందు నుంచి అనుకున్నా శివాజీ కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం అందరిని ఆశ్చర్య పరిచే అంశం. అయితే ఈ విషయంలో మోసం జరిగిందంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వస్తున్న క్రమంలో దాని గురించి శివాజీ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తనని ఆదరించిన ప్రేక్షకులను, తనకి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున, బిగ్‌బాస్ కి కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన బిగ్‌బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు కానీ అలాంటిది ఏం లేదన్నారు.
Animal: అనిమల్ ఓటిటీ… అవేమి ఉండవంట..?
తాను వాటిని నమ్మనని, బిగ్‌బాస్ ఓటింగ్ ఫార్మాట్ తోనే విన్నర్ ని అనౌన్స్ చేస్తారు, అలాగే ప్రశాంత్ ని విజేతగా ప్రకటించారని అన్నారు. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకు అంటే షో స్టార్టింగ్ లో అతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక కామన్ టైటిల్ సాధిస్తే చాలా బాగుంటుంది అనుకున్నా, ఎందుకంటే నేను అలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే అని అన్నారు. ఇక యావర్ కూడా ఒక కామన్ మ్యాన్ గానే వచ్చాడు, అందుకే మాకు స్నేహం కుదిరింది, అంతేతప్ప గేమ్ ప్లాన్స్ ఏం లేవని శివాజీ చెప్పుకొచ్చారు.
Shivanna about #BiggBoss journey
Miss you anna 💔#BiggBossTelugu7 #Sivaji #BiggBoss7Telugu #Shivaji pic.twitter.com/df4vcXBizg
— S (@UrsShareef) December 18, 2023