Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా చరిత్రలో సునామీలా మార్పులు తెచ్చిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించి, అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ ఐకానిక్ చిత్రం 36 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు సినీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు అదే లెజెండరీ సినిమా నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.
Also Read : Mass Jathara : మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ – రవితేజ మాస్ ఎంట్రీకి రెడీ!
Also Read
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
‘శివ’ విడుదలైన రోజుల్లోని ఆ మాస్ క్రేజ్, యూత్ రెస్పాన్స్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, రియలిస్టిక్ టేకింగ్, ఇలయరాజా సంగీతం, నాగార్జున స్టైల్ ఇవన్నీ కలిసి ఆ సినిమాను కొత్త దిశగా తీసుకెళ్లాయి. అందుకే ఈ సినిమా రీ-రిలీజ్‌కి ముందు నుంచే టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక ఈ సందర్భంగా ప్రముఖులు, దర్శకులు ‘శివ’ తమ జీవితంపై చూపిన ప్రభావం గురించి పంచుకుంటున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పెషల్ మెసేజ్ ఇచ్చారు.
ఆ వీడియోలో బన్నీ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’ ఒక ఐకానిక్ చిత్రం. ఆ ఒక్క సినిమా భారతీయ సినీ పరిశ్రమకు కొత్త దారులు చూపింది. మాస్, రియలిజం, టెక్నికల్ బ్రిలియన్స్ అన్నీ కలిపిన ఒక అద్భుతం అది. అలాంటి సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంటే ఆ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలి. అక్కినేని అభిమానులకే కాకుండా ప్రతి తెలుగు సినిమా ప్రియుడికి ఇది సెలబ్రేషన్ లాంటిది. ఈసారి థియేటర్‌కి వెళ్లేటప్పుడు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి!” అని తనదైన మాస్ స్టైల్‌లో సందేశం ఇచ్చాడు. బన్నీ ఇచ్చిన ఈ ఫన్నీ, ఫ్యాన్‌ఫుల్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు బన్నీ వీడియో పై ఇటు నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా స్పందించారు. మొత్తనికి నాగార్జున – వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మాస్టర్‌పీస్ రీ-రిలీజ్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 36 ఏళ్ల క్రితం తెరపై మళ్లీ శివ గర్జించబోతున్నాడు.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!