Site icon NTV Telugu

Amaran: దీపావళికి రిలీజ్ కాబోతున్న మరో స్టార్ హీరో సినిమా

Maxresdefault

Maxresdefault

Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో, రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ సిరీస్‌లోని ఒక అధ్యాయం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఇక ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయిపల్లవి నటిస్తోంది.

Also Read: Rambha Daughter: హీరోయిన్లను మించేలా రంభ కూతురు.. స్టార్ హీరోతో ఫొటోలు చూశారా ?

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపైన అంచనాలు పెంచేశాయి. అలానే మూవీలో కూడా ఆర్మీ జవాన్‌గా స్టైలిష్ లుక్‌లో అదరకొట్టనున్నాడు. ఇక తాజాగా ‘అమరన్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీపావళి 2024 సందర్భంగా అక్టోబర్ 31 న థియేటర్లలో విడుదల కానుంది అంటు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. అలానే ఈ చిత్రం తమిళం మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది అంటు అనౌన్స్ చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ విలన్‌ గా నటిస్తున్నాడు. కథానుగుణంగా కశ్మీర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది అమరన్‌ టీం. కశ్మీర్‌లో 75 రోజులపాటు అమరన్‌ లాంగ్ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఇప్పటికే సాయిపల్లవి కశ్మీర్‌ లొకేషన్‌లో దిగిన ఫొటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి..మరి ఈ సినిమాతో శివకార్తికేయన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version