Babloo Prithiveeraj: అవును.. మేము పెళ్లి చేసుకోలేదు.. అది చేశామంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babloo Prithiveeraj: బబ్లూ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పెళ్లి అనే సినిమాలో విలన్ గా నటించి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ సినిమా తరువాత విలన్ గా, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే అనిమల్ సినిమాలో విలన్ గా కనిపించి పాన్ ఇండియా లెవెల్ గుర్తింపును అందుకున్నాడు. ఇక బబ్లూ పృథ్వీరాజ్ సినిమాల కంటే ఎక్కువ ప్రేమలు, పెళ్లిళ్ల దావారనే బాగా ఫేమస్ అయ్యాడు. గతేడాది తెలుగమ్మాయి శీతల్ తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. తనకంటే వయస్సులో సగం ఉన్న అమ్మాయిని పెళ్ళాడి షాక్ ఇచ్చాడు. ఈ వయస్సులో పెళ్లి చేసుకుంటే తప్పేంటి.. ? అన్నట్లు మాట్లాడిన బబ్లూ పృథ్వీరాజ్ .. తాజాగా శీతల్ తో కూడా బ్రేకప్ చేసుకున్నాడు. ఈ విషయాన్నీ శీతల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
“చాలామంది నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారు. పృథ్వీ, నేను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశామంతే.. మేము ఊహించినట్లుగా మా రిలేషన్‌షిప్ ముందుకు వెళ్లలేదు. అయితే ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే మేము విడిపోయాము. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక బబ్లూ పృథ్వీరాజ్ కు శీతల్ కన్నా ముందే బీనా అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!