‘శ్యామ్ సింగరాయ్’ సాంగ్: నానితో ఏదో తెలియని లోకంలో విహరిస్తున్న కృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అయన నటించిన ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో నాని ఆశలన్ని తన తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ పైనే పెట్టుకున్నాడు. టాక్సీ వాలా తో హిట్ దర్శకుడిగా మారిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎదో ఎదో తెలియని లోకమా’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కృష్ణ కాంత్ లిరిక్స్.. చైత్ర హస్కీ వాయిస్.. మిక్కీ జే మేయర్ సంగీతం మెస్మరైజ్ చేశాయి.
ప్రేమించినవాడి పక్కన ఉంటే ప్రేయసి ఎలాంటి అనుభూతి చెందుతుందో, ఆమె మనుసులోని భావాలను చూపించారు. ఇక వీడియోలో నాని, కృతి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపించింది. చివర్లో కృతి- నాని మధ్య లిప్ లాక్ సాంగ్ హైలైట్ గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నాని హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!