Site icon NTV Telugu

Sharwanand: త్వరలోనే శర్వానంద్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

Sharwanand Marriage

Sharwanand Marriage

Sharwanand To Marry Rakshita Reddy: టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో శర్వానంద్ ఒకడు. అయితే.. ఇప్పుడు ఆ ట్యాగ్ నుంచి అతడు విముక్తి పొందుతున్నాడు. ఎందుకంటే.. త్వరలోనే శర్వా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో శర్వా త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నాడు. ఈనెల 26వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇరు కుటుంబసభ్యులు వీరి పెళ్లి తేదీని వెల్లడించనున్నారు. కాగా.. రక్షితకు రాజకీయ నేపథ్యం ఉంది. ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఆమె మనవరాలు. ఆమె మేనమామ గంగారెడ్డి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అల్లుడు.

Pakistan: అంధకారంలో పాకిస్థాన్.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం

కాగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో అతిథిగా నటించిన శర్వా, రామ్ చరణ్‌కి బెస్ట్ ఫ్రెండ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. గమ్యం సినిమాతో కథానాయకుడిగా తనదైన ముద్ర వేసిన శర్వానంద్.. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇతడు నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ కూడా దక్కింది. శర్వా పెళ్లి గురించి ఇదివరకే వార్తలు రాగా.. అప్పుడు అమ్మాయికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి రక్షితా రెడ్డి అని వెల్లడైంది. మొత్తానికి శర్వానంద్ తన 38వ ఏట ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట!

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. వన్డే ర్యాంకింగ్స్‌లో నం1

Exit mobile version