Biker: శర్వా ‘బైకర్’ జోరు.. తొలి వీకెండ్ లోనే రూ. 18 కోట్ల వసూళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్ ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కొట్టారు. భారీ అంచనాల మధ్య విడుదలైన హై-ఆక్టేన్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 18.09 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సినిమాలకు మొదటి రోజు భారీ వసూళ్లు రావడం సహజం, కానీ ‘బైకర్’ విషయంలో ఒక అరుదైన ట్రెండ్ కనిపిస్తోంది. శుక్రవారం మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, శనివారం నాటికి పుంజుకుని, ఆదివారం నాడు అత్యధిక వసూళ్లతో కెరీర్ బెస్ట్ రన్ కొనసాగించింది. మౌత్ టాక్ బాగుండటంతో థియేటర్ల వద్ద జనం క్యూ కడుతున్నారు.
Also Read:Rakasa: దూసుకుపోతున్న రాకాస.. మూడు రోజుల్లో షాకింగ్ కలెక్షన్స్
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
సీనియర్ హీరో రాజశేఖర్, శర్వానంద్ మధ్య సాగే ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. అడ్రినాలిన్ పెంచే రేసింగ్ సన్నివేశాలు యువతను థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరైన మోతాదులో కలిపిన దర్శకుడి ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా కోసం శర్వానంద్ చేసిన శారీరక మార్పులు, ఆయన కనబరిచిన అంకితభావం స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా యూనిట్ చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్లు కూడా కలెక్షన్లు పెరగడానికి దోహదపడుతున్నాయి.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!