NTV Telugu Site icon

Pathaan Trailer: రామ్‌చరణ్ విడుదల చేసిన ‘పఠాన్’ ట్రైలర్

Pathaan Trailer

Pathaan Trailer

Pathaan Trailer: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి అభిమానుల సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీలో అతిథి పాత్రలో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ‘పఠాన్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షారుఖ్ ఖాన్‌ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్‌గా తెరకెక్కిన పఠాన్ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Read Also: Smile During Pregnancy : ప్రెగ్నెన్సీ టైంలో నవ్వితే ఏమవుతుందో తెలుసా..?

పఠాన్ ట్రైలర్ కూడా విడుదల కాకముందే బాయ్‌కాట్ పఠాన్ అంటూ నెట్టింట రచ్చ నడుస్తోంది. ఈ మూవీలో బేషరమ్ రంగ్ సాంగ్‌లో దీపికా పదుకునే వస్త్రధారణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీపికా కాషాయం రంగు బికినీ ధరించడం తీవ్రస్థాయిలో దుమారం రేగింది. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఒక సైనికుడు తనకోసం దేశం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తాను ఏం చేయగలనా అని ఆలోచిస్తాడని షారుఖ్ చెప్పే డైలాగ్ బాగుంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పఠాన్‌లో జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. హైవోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత హిట్ అందుకోని బాలీవుడ్ బాద్‌షా ఈ మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో ఈనెల 25న తేలిపోనుంది.