Smile During Pregnancy : నవ్వడం ఒక భోగం… నవ్వ లేకపోవడం ఓ రోగం అన్న సామెత తెలుసుకదా.. అందుకే నవ్వేందుకు అందరూ ఇష్టపడతారు.. అదీగాక నవ్వు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే, గర్భధారణ సమయంలో నవ్వుతూ, సంతోషంగా ఉండటం వల్ల తల్లి, బిడ్డకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నవ్వు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది. అందుకే చాలా మంది లాఫ్టర్ థెరపీ లేదా లాఫ్టర్ ఎక్సిషన్ చేయించుకుంటారు. గర్భధారణ సమయంలో మహిళలు నవ్వుతూ ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. నవ్వడం వల్ల తల్లీ బిడ్డ ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
పుట్టబోయే శిశువు చురుగ్గా ఉంటారు
గర్భధారణ సమయంలో తల్లీ సంతోషంగా నవ్వుతూ ఉంటే పుట్టబోవు సంతానం చురుగ్గా ఉంటారు. పుట్టిన తర్వాత కూడా వారిలో ఎదుగుదల బాగా ఉంటుంది. వారికి ఆరోగ్య సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. నవ్వుతూ ఉండే స్త్రీలకు అనారోగ్య సమస్యలు చాలా వరకు రావు.
తక్కువ ఒత్తిడి
గర్భధారణ సమయంలో స్త్రీల మానసిక స్థితి మారుతుంది. చిన్నచిన్న విషయాలే టెన్షన్‌ని కలిగిస్తాయి. ఇది తల్లి, బిడ్డపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నవ్వాలి. నవ్వుకోవడానికి కామెడీ సినిమాలు చూడండి, జోకులు చదవాలి.. వినాలి. ఇవి కొంతవరకు ఒత్తిడిని తగ్గిస్థాయి.
Read Also: Actor Srikanth: వారసుడు 100శాతం పక్కా హిట్
నొప్పి తగ్గుతుంది
గర్భధారణ సమయంలో, గర్భిణీ స్త్రీలు తలనొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, శరీరం వాపు, అలసటతో బాధపడుతుంటారు. దీనికి పరిష్కారంగా లాఫ్టర్ థెరపీ ఉపయోగపడుతుంది. లాఫర్ థెరపీ వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. దీని కారణంగా ప్రెగ్నెన్సీ మహిళల్లో ఉండే సాధారణ నొప్పులను తగ్గించుకోవచ్చు. తరచుగా నవ్వే వారికి అది అనుభూతి చెందుతూనే ఉంటారు.
నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
గర్భధారణ సమయంలో స్త్రీలని సంతోషంగా, నవ్వుతూ ఉంచడం వారిలో ఒత్తిడిని తగ్గిస్తుంది.. తల్లి యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పుట్టిన బిడ్డలో కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది పుట్టిన శిశువుకు అన్ని సమయాలలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
Read Also:Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు
రక్తపోటు సాధారణంగా ఉంటుంది
గర్భధారణ సమయంలో చాలా మంది మహిళల రక్తపోటు పెరుగుతుంది. ఇది తల్లి మరియు బిడ్డ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే లాఫ్టర్ థెరపీ రక్తపోటును సాధారణీకరించడానికి సహాయపడుతుంది.