కరోన తర్వాత బిజినెస్ లేక మూతబడిన థియేటర్స్ ని కూడా రీఓపెన్ చేసేలా చేస్తున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలో బాద్షాగా మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్ ఈ జనవరి 25న ఆడియన్స్ ముందుకి ‘పఠాన్’గా రానున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ మూవీ బాలీవుడ్ ని కష్టాల నుంచి బ్రతికిస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ పఠాన్ సినిమా ప్రీబుకింగ్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మల్టీప్లెక్స్ నుంచి సింగల్ స్క్రీన్స్ వరకూ షారుఖ్ ని చూడడానికి ప్రతి ఒక్కరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ కారణంగా టికెట్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. నార్త్ లో చాలా రోజుల తర్వాత సినిమా కళ కనిపిస్తోంది అంటే దానికి కారణం పఠాన్ మూవీనే. అన్ని సెంటర్స్ లో టికెట్స్ బుక్ అయిపోతూ ఉండడంతో, షారుఖ్ ఖాన్ కోసం ఇండియాలో కరోన సమయంలో మూతబడిన 25 థియేటర్స్ ని రీఓపెన్ చేస్తున్నారు.
ఫస్ట్ డే వీలైనంత ఆడియన్స్ పఠాన్ సినిమాని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కాబట్టే పఠాన్ మూవీకి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకోని ఈ థియేటర్స్ ని రీఓపెన్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా, ఇండస్ట్రీకి హెల్ప్ అయ్యేలా ఉండాలి. ప్రస్తుతం పఠాన్ సినిమా చేస్తుంది అదే. ఈ థియేటర్స్ ఓపెన్ అయితే అది ఇండస్ట్రీ రెవిన్యూని పెంచుతుంది. దాదాపు అయిదున్నర ఏళ్ల తర్వాత హీరోగా తెరపై కనిపించనున్న షారుఖ్ ఖాన్ ని దీపిక పదుకోణే గ్లామర్ కూడా కలిసి పఠాన్ సినిమాని మరింత స్పెషల్ చేసింది. పఠాన్ మూవీ టికెట్ బుకింగ్స్ పీక్ స్టేజ్ లో ఉండడానికి మరో ముఖ్య కారణం, ఈ మూవీలో సల్మాన్ ఖాన్ క్యామియో ప్లే చేస్తూ ఉండడమే. షారుఖ్ ని, సల్మాన్ ఖాన్ ని ఒకేసారి తెరపై చూడడానికి సినీ అభిమానులు థియేటర్స్ కి క్యు కడుతున్నారు. మరి ఈ మూవీ డే 1 ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.